
BJPకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్… కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ కమలం పార్టీపై విమర్శలు చేశారు. కమలం పార్టీ విధానాలు ఎలా ఉంటున్నాయో ఎవరికీ అర్థం కావని… చివరకు BJP, BRS ఒక్కటేనని స్పష్టమైందన్నారు. రాష్ట్రంలో BJP గ్రాఫ్ అంతకంతకూ పడిపోయిందన్న మాజీ మంత్రి… ఎన్నికలకు ముందు బండి సంజయ్ ని అధ్యక్షుడిగా ఎందుకు తీశారో అర్థం కాలేదన్నారు. సంజయ్ వల్ల పార్టీ బలంగా మారి రానున్న ఎలక్షన్లలో గట్టి పోటీనిచ్చేదని.. కానీ ఉన్నట్టుండి ఆయన్ను కీలక బాధ్యతల నుంచి తీసేయడం నచ్చలేదన్నారు. అసలు సంజయ్ ను ఎందుకు మార్చారో ఇప్పటికీ అర్థం కాలేదన్నారు.
సంజయ్ ను తొలగించడం ద్వారా BJP, BRS ఒక్కటేనని తెలిసిందన్నారు. కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారన్న చంద్రశేఖర్.. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నానని త్వరలోనే హస్తం పార్టీలోనే జాయిన్ అవుతానన్నారు.