Published 05 Jan 2024
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎప్పుడూ హాట్ హాట్ గా మాట్లాడే సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి మరోసారి అదే తీరైన మాటలు మాట్లాడారు. ఓడిపోతానని తనకు ముందే తెలుసని ఇంతకుముందే చెప్పిన ఆయన.. ఓడిపోవడం ద్వారా అనుభవ పాఠాలు నేర్చుకోవచ్చంటూ వేదాంతం మాట్లాడారు. నా విషయంలో శాడిస్టుల్లా వ్యవహరిస్తారా.. ఏంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఉండొద్దా.. అంటూ ఇంతకుముందే సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడ్డ జగ్గారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రులు కేటీ రామారావు, హరీశ్ రావు మాట్లాడిన తీరుపై జగ్గారెడ్డి మండిపడ్డారు. నేను ఓడిపోవడం బ్యాడ్ లక్.. ఒకవేళ గెలిచుంటేనే వాళ్లను ఆటాడుకునేటోణ్ని అంటూ జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాశ్ రెడ్డి) అన్నారు.
ఒక్కసారి ఆయన మాటల్లోనే…
‘బ్యాడ్ లక్కు… ఇగ టైమ్ బాగలేదు… గవర్నమెంటచ్చే టైమ్ కు నేను బయటున్నా గానీ… నేను లోపల ఆడుతుంటి ఆట వీళ్లతోని… లోపలుండి, టైమ్ బాగుండి, నేను ఎమ్మెల్యేగుంటే KTR, హరీశ్ రావును ఆడుకుంటుంటి మంచిగ… నాకు తెలుసు వాళ్లతో ఏట్లాడుకోవాల్నో.. అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. ఇప్పుడీ కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. ఐదుసార్లు పోటీచేసిన ఆయన 2014లో తొలిసారి ఓటమి చవిచూశారు. తర్వాత మరోసారి మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.