భారతీయ జనతా పార్టీ తన తుది జాబితాను విడుదల చేసింది. నామినేషన్లకు గడువు ముగుస్తుండగా 14 మందితో కూడిన లిస్ట్ ను ప్రకటించింది. ఎన్.రాంచందర్ రావు సహా నిన్న రాత్రి ఆరుగురు పేర్లతో ప్రత్యేక లిస్ట్ వెలువరించినా.. ఇప్పుడు మాత్రం ఆ ఆరుగురికి మిగిలిన మరో 8 మందిని జత చేసి ఫైనల్ లిస్ట్ ను పార్టీ విడుదల చేసింది. వనపర్తి, బెల్లంపల్లి, చాంద్రాయణగుట్ట అభ్యర్థులను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తమకు మద్దతు ప్రకటించిన జనసేనతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇరు పార్టీల సమన్వయం కుదిరాకే ఈ ఫైనల్ లిస్ట్ ను రిలీజ్ చేశారు.
ఈరోజుతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తున్న దృష్ట్యా మిగిలిపోయిన స్థానాలకు ఉదయాన్నే పార్టీ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. 119 స్థానాలకు గాను BJP మొత్తం 111 మంది అభ్యర్థుల్ని ప్రకటించి మరో ఎనిమిదింటిని జనసేనకు కట్టబెట్టింది.
మేడ్చల్ – ఏనుగు సుదర్శన్ రెడ్డి
మల్కాజిగిరి – ఎన్.రామచందర్ రావు
శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్
నాంపల్లి – రాహుల్ చంద్ర
చాంద్రాయణగుట్ట – కె.మహేందర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – గణేశ్ నారాయణ్
సంగారెడ్డి – దేశ్ పాండే రాజేశ్వర్ రావు
బెల్లంపల్లి – కొయ్యల ఎమాజి
పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్
దేవరకద్ర – ప్రశాంత్ రెడ్డి
నర్సంపేట – పుల్లారావు
మధిర – విజయరాజు
వనపర్తి – అనుజ్ఞారెడ్డి
అలంపూర్ – మేరమ్మ