పార్టీ కోసమే కష్టపడుతున్న తమ నేతల్ని పట్టించుకోరా అంటూ కాంగ్రెస్(INC) పార్టీలోని లీడర్ల అనుచరులు, కార్యకర్తలు అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ హైకమాండ్ తాజాగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల(election) కమిటీ లిస్ట్ పై అసంతృప్తి కనిపిస్తోంది. సిన్సియర్ గా, వివాదాలకు దూరంగా నిలిచే పొన్నం ప్రభాకర్ కు ఈ కమిటీ(committee)లో ప్లేస్ దక్కలేదు. దీంతో పార్టీలో అత్యంత సీనియర్ లీడర్ అయిన మాజీ MP పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆవేదనతో ఉన్నారు. కష్టకాలంలోనూ పార్టీకి అండగా నిలిచిన వ్యక్తిని విస్మరిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ విషయంపై తమ నేత ప్రభాకర్ ను కరీంనగర్ జిల్లా లీడర్లు, కార్యకర్తలు కలిశారు. ఆయన్ను కలిసిన వారిలో DCC ప్రెసిడెంట్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఎలక్షన్ కమిటీలో పొన్నం పేరు లేకపోవడంపై ఫైర్ అయ్యారు.
‘ఆయన ఏం తప్పు చేశారని కమిటీల్లో స్థానం కల్పించలేదు.. పార్టీలో ఉంటూ ద్రోహం చేసిన వ్యక్తి కాదాయన’ అని DCC ప్రెసిడెంట్ అన్నారు. మరోవైపు ‘తెలంగాణ ప్రకటించడానికి సోనియాను ఒప్పించి మరీ మెప్పు పొందిన ప్రభాకర్ ను ఇలా చేయడం సరికాదని, దీనిపై రేపు కరీంనగర్ నుంచి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్తామని’ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రకటించారు.