
అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు మొదలైన రోజే(Starting Day) ఆ సంఖ్య సెంచరీ దిశగా సాగింది. ఫస్ట్ డే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 94 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం(Election Commission) తెలియజేసింది. అధికార BRS నుంచి తొలి రోజు ఒక్కటి దాఖలు కాకపోగా.. కాంగ్రెస్ నుంచి 8, BJP నుంచి 3 వచ్చాయి. PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరఫున కొడంగల్ నుంచి ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి నామినేషన్ వేయగా.. ఖమ్మం నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ గా తుమ్మల నాగేశ్వర్ రావు నామినేషన్ దాఖలు చేశారు.