Published 23 Jan 2024
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల్లో(Six Guarantees) ముఖ్యమైన పథకం(Scheme) గృహజ్యోతి. పేద కుటుంబాలకు ఇంటికి 200 యూనిట్ల చొప్పున కరెంటు ఉచితంగా ఇస్తామన్నది రేవంత్ సర్కారు హామీ. గత ఎన్నికల్లో మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి పథకాలతో కూడిన అభయహస్తం గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి నెలన్నర రోజులు పూర్తయింది. ఇచ్చిన హామీల్ని 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని ప్రకటించి ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Journey) అమలు చేస్తున్నారు. ఇక మిగిలిన స్కీమ్ లు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారంటూ ప్రధాన ప్రతిపక్షం BRS నేతలు ప్రశ్నిస్తున్న వేళ.. మరో పథకానికి సంబంధించిన క్లారిటీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చారు.
వచ్చే నెల నుంచి ఉచిత కరెంటు…
రాష్ట్రవ్యాప్తంగా అభయహస్తం కోసం భారీ స్థాయిలో అప్లికేషన్లు రాగా.. అందులో రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్తు కోసం ఎక్కువగా ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంటు హామీని వచ్చే నెల నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 200 యూనిట్ల మేరకు ఉచితంగా కరెంటును ఇస్తామన్న హామీని నిలుపుకొంటామని క్లారిటీ ఇచ్చారు. KCR సర్కారు వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్న మంత్రి.. ఆర్థిక పరిస్థితుల గందరగోళం వల్లే హామీల అమలుకు ఆలస్యమవుతుందన్నారు.
మరిన్ని చదవండి:… 2024 టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఏ స్కూటర్ ధర ఎంతంటే?
మాజీ మంత్రి ఇక జైలుకే…
విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో దారుణాది దారుణాలకు పాల్పడ్డ గత ప్రభుత్వ హయాంపై విచారణ సాగించి ఆ శాఖ మంత్రిగా ఇంతకుముందు పనిచేసిన జగదీశ్ రెడ్డిని జైలుకు పంపడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. KCR కుటుంబం తర్వాత కారాగారాని(Jail)కి పోయేది జగదీశ్ రెడ్డేనని ఇంతకుముందే కోమటిరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఈ మాజీ మంత్రి జైలు ప్రస్తావన తీసుకువచ్చారు.
మరిన్ని చదవండి:… ఎమర్జెన్సీగా డబ్బులు పంపాలా?… ఆఫ్లైన్లో ఈజీ యూపీఐ పేమెంట్లు చేయొచ్చు…!
మరిన్ని చదవండి:… ‘వాట్సాప్’లో అడ్మిన్లను బ్లాక్ చేసే సరికొత్త ఫీచర్…