ముహూర్తం మంచిగా ఉండటంతో నామినేషన్లలో నేడు కీలక ఘట్టం జరగనుంది. ఈనెల 3న నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వాత ఈ స్థాయిలో అభ్యర్థులు నామినేషన్లు వేయనుండటంతో ఏకాదశి రోజు అయిన గురువారం నాడు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి KCRతోపాటు KTR, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా ఇవాళ పత్రాలు అందజేయనున్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేయనుండగా.. 11 గంటలకు గజ్వేల్ లో, 2 గంటలకు కామారెడ్డిలో ఆర్వో కార్యాలయానికి వెళ్తారు. అటు KTR సిరిసిల్లలో 11:45 గంటలకు నామినేషన్ వేస్తారు.
సిద్దిపేటలో హరీశ్ రావు, వనపర్తిలో నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, ఖమ్మంలో భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్లు వేస్తున్నారు. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని RO కార్యాలయాల్లో శుక్రవారం నాడు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు కానున్నాయి.