తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. అవినీతి కేసుల్లో అరెస్టై జైలు పాలైన మంత్రి వి.సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కు తెలియకుండానే మంత్రిని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. పలు అవినీతి, అక్రమాల కేసుల్లో సెంథిల్ బాలాజీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జాబ్స్ రిక్రూట్ మెంట్లలో డబ్బులు తీసుకోవడం, మనీ లాండరింగ్ కు పాల్పడటం వంటి కేసులు ఆయనపై నమోదు కావడంతో ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈ పరిణామాలతో మంత్రిని వెంటనే బర్తరఫ్ చేస్తున్నట్లు తమిళనాడు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.
మంత్రి మండలిలో సెంథిల్ ను కొనసాగించడం వల్ల న్యాయమైన విచారణ జరిగే అవకాశం ఉండదని, రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉండొచ్చని ప్రకటనలో గవర్నర్ అభిప్రాయపడ్డారు. బాలాజీ మంత్రిగా కొనసాగితే విచారణను దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా నిర్వర్తించే వీలుండదని, ఆయన వాటిపై ప్రభావం చూపే ఆస్కారం ఉందని గవర్నర్ భావించినట్లు రాజ్ భవన్ తెలిపింది. అవినీతి మకిలి అంటిన వ్యక్తి మంత్రి మండలిలో ఉండటం మంచిది కాదని స్పష్టం చేశారు.
అయితే సీఎం స్టాలిన్ కు తెలియకుండానే మంత్రిని తొలగించడంతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సంచలనం జరిగింది. ఇప్పటికే గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి స్టాలిన్ కు మధ్య దూరం కంటిన్యూ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిని బర్తరఫ్ చేయడం ఏ ఇష్యూస్ కి దారితీస్తుందోనన్న ప్రచారం ఊపందుకుంది.
H.H.Givernor of Tamilnadu taken appropriate action. If a corruptible Minister is removed from Cabinet without consulting C.M is as per law. After arrest of a minister why C.M was kept quite. It was his duty to remove. But not complied with rules . Hence H.H.Governor taken action as per law . Every citizen of India has to appreciate the action of H.H.Governor.