Published 02 Jan 2024
కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Lift Irrigation) చోటుచేసుకున్న అవినీతిపై న్యాయ విచారణకు రంగం సిద్ధమైంది. దీనిపై రేవంత్ సర్కారు పూర్తి క్లారిటీ ఇచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు, కాళేశ్వరం నిర్మాణం తీరుపై ‘జ్యుడీషియల్ ఎంక్వయిరీ’ వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
మరో ఏడు రోజుల్లోనే దీనిపై న్యాయ విచారణ జరగబోతుందని స్పష్టం చేశారు. BRS సర్కారు కోసమే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. KCRతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు చెప్పే BJP.. ఈ ప్రాజెక్టుపై ఎందుకు CBI ఎంక్వయిరీ వేయలేదని ప్రశ్నించారు.