రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటూ పెద్ద రియల్ ఎస్టేట్(Real Estate) సంస్థలా తయారైందని BJP సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ విమర్శించారు. KCR భూదందాలకు పాల్పడుతున్నారని, దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది మంది బాధితులు తయారయ్యారని ఆవేదన చెందారు. ఎక్కడ భూములు అవసరమైనా అసైన్డ్ ల్యాండ్స్(Assigned Lands) నే తీసుకుంటున్నారని, వీటిని అమ్ముకుంటూ మళ్లీ సర్కారును దివాలా తీయిస్తున్నారన్నారు.
పొరుగు రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తుంటే ఇక్కడ మాత్రం లాగేసుకుంటున్నారని, 40-50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న వాటినీ వదలట్లేదని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్, డెవలప్ మెంట్ పేరిట జాగాల్ని తీసుకోవడం దారుణమని, పేదల పొట్టగొడుతూ వారిని ఎటూగాకుండా చేస్తున్నారని ఈటల అన్నారు.