ఫార్మా కంపెనీల పేరిట తలపెట్టిన భూసేకరణ(Land Acquisition) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల ఘటన తీవ్ర వివాదాస్పదం కావడంతో భూసేకరణ విషయంలో వెనక్కు తగ్గి నోటిఫికేషన్ విత్ డ్రా చేసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్లతోపాటు సమీప గ్రామాల సమీపంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు రైతుల నుంచి భూములు సేకరించేందుకు గాను ఈ ఆగస్టు 1న జారీ చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. 580 మంది నుంచి భూమిని సేకరించాల్సి ఉండగా. లగచర్లలో 632 ఎకరాల విషయంలో గందరగోళం ఏర్పడింది.