Published 14 Nov 2023
పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆదాయ, వ్యయాలపై దృష్టిసారించిన రాష్ట్ర సర్కారు.. ఇకనుంచి జరిపే కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని డిసైడ్ అయింది. రానున్న రోజుల్లో ఒక్క వాహనం(Vehicle) కూడా కొనేది లేదని కరాఖండీగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తెలియజేశారు. అసెంబ్లీ భవనాలు అన్నింటినీ వాడుకుంటామన్న సీఎం.. వెహికిల్స్ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని చేసేదే లేదన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(MCHRD)లోని ఖాళీ స్థలాన్ని కూడా ఉపయోగిస్తామని, అక్కడ CM క్యాంపు ఆఫీసు కడతామన్నారు.
అంతా ఉట్టిదేనంటూ
24 గంటల కరెంటు ఇచ్చామంటూ KCR సర్కారు కోతలు మాత్రమే కోసిందని, కానీ ప్రజలకు ఇచ్చింది కేవలం 12 నుంచి 14 గంటలేనని రేవంత్ వివరించారు. ప్రతి డిపార్ట్ మెంట్ జరిగిన వ్యవహారాలపై అందరితో చర్చించి శ్వేతపత్రాలు(White Papers) విడుదల చేస్తామని, తద్వారా నిజానిజాలేంటే ప్రజలకు తెలుస్తాయన్నారు.