హైదరాబాద్ ఉప్పల్ పరిధి మేడిపల్లి(Medipally)లోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. MLC కవిత అనుచరులు నినాదాలు చేసుకుంటూ మరో MLC అయిన మల్లన్న ఆఫీసులోకి చొరబడ్డారు. కవిత చేస్తున్న BC ఉద్యమాన్ని తప్పుపడుతూ ‘దేంట్లో పొత్తు’ అంటూ అనుచిత కామెంట్స్ చేశారన్నది ఆరోపణ. కార్యాలయంలోని కిటికీ, అద్దాలు సహా ఫర్నిచర్ ధ్వంసానికి ప్రయత్నిస్తున్న సమయంలో గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. సహచర MLC తీరుపై ఫిర్యాదు చేసేందుకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవబోతున్నారు కవిత.