కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే తనను ముఖ్యమంత్రి చేయాలని, అప్పుడు తానేంటో చూపిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి తనను CM చేస్తే మేడిగడ్డ ప్రాజెక్టు ఎలా రిపేర్ చేయాలో చూపిస్తానన్నారు. కాళేశ్వరం కింద 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని, కానీ 98 వేల ఎకరాలకే నీరిచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపున్నదన్నారు.
బురద రాజకీయాలంటూ…
హరీశ్ కామెంట్స్ చూస్తే… ‘వాళ్లకు చేతకాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పమనండి, వాళ్లను తప్పుకోమనండి మేం జేసి చూపిస్తం… అవునయా దిగుమను.. రేవంత్ రెడ్డిని రాజీనామా చెయ్ మను, నేనెక్కి చేపిస్తా… రేవంత్ రెడ్డిని రాజీనామా చెయ్ మను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తా.. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐయామ్ రెడీ టూ టేకిట్(Iam Ready To Take It).. ఆయనకు చేతగాదు, హరీశ్ రావు నువ్వు చెయ్ అంటే చేసి చూపిస్తా’… అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ వి బురద రాజకీయాలంటూ విమర్శలు చేశారు.