మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైకోర్టు(High Court)లో పిటిషన్ వేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టివేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించడంతోపాటు కేసు కొట్టివేయాలని హరీశ్ అందులో కోరారు. BRS పాలనలో హరీశ్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని, ఆయనతోపాటు మాజీ DCP రాధాకిషన్ రావుపై కంప్లయింట్ ఇవ్వడంతో ఆ ఇద్దరిపై కేసు ఫైల్ అయింది. సిద్ధిపేట నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 1న పంజాగుట్ట పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారంటూ హరీశ్ రావు.. హైకోర్టును ఆశ్రయించారు.