రసవత్తరంగా సాగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఎన్నికల్లో అర్షనపల్లి జగన్మోహన్ రావు గెలుపొందారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్ క్యాండిడేట్ అయిన జగన్మోహన్ రావు కేవలం రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అమర్ నాథ్ పై ఆయన అనూహ్య విజయాన్ని అందుకున్నారు.
వివిధ ప్యానెళ్ల నుంచి పలువురు ఆయా పదవులకు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా(Vice President) సర్దార్ దల్జీత్ సింగ్(గుడ్ గవర్నెన్స్ ప్యానెల్) ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
జాయింట్ సెక్రటరీగా బసవరాజ్(గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), సెక్రటరీగా దేవరాజ్(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), ట్రెజెరర్ గా సీజే శ్రీనివాసరావు(యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్), కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) ఎన్నికయ్యారు.