ORR టోల్ కాంట్రాక్టుపై రేవంత్ రెడ్డికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. MPకి సమాచారం ఇవ్వకపోతే పార్లమెంటులో ఎలా దీనిపై మాట్లాడగలరు అని పేర్కొంది. టోల్ టెండర్లపై RTI ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదంటూ రేవంత్ ఈ నెల 26న కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సమాచారం ఎందుకివ్వట్లేదని అడ్వొకేట్ జనరల్(AG)ని ప్రశ్నించింది. దీనిపై AG సమాధానమిస్తూ RTI యాక్టు పరిమితుల మేరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించేందుకు 2 వారాల టైమ్ అడిగారు. దీంతో విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. భారీ స్కామ్ జరిగిందని, వెయ్యి కోట్లు చేతులు మారాయని అంటున్నారు. టెండర్ల కోసం 4 కంపెనీలు బిడ్లు వేస్తే ఎక్కువ కోట్ చేసిన కంపెనీకి బిడ్ దక్కింది. రూ.7,380 కోట్లకు బిడ్ సొంతం చేసుకోగా.. ఇకనుంచి మెయింటెనెన్స్ తోపాటు టోల్ కలెక్షన్స్ వంటివన్నీ ఆ కంపెనీకే చెందుతాయి. అయితే ఇందులో సీనియర్ రిటైర్డ్ IASతోపాటు ప్రస్తుతం కీలక శాఖలో ఉన్న మరో IAS పాత్ర ఉందని రేవంత్ ఆరోపించారు. ఏటా రూ.700 నుంచి రూ.800 కోట్లు వసూలయ్యే లీజును తక్కువ ధరకే కట్టబెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారు.