హైదరాబాద్ ఇందిరా పార్క్(Indira Park) వద్ద రేపు BJP చేపట్టబోయే ధర్నా(Dharna)కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. మధ్యాహ్నం కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ధర్నాకు ఓకే చెప్పింది. పేదలకు పక్కా ఇళ్లు కేటాయించాలంటూ.. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కమలం పార్టీ మంగళవారం నాడు ఇందిరాపార్క్ ధర్నాకు పిలుపునిచ్చింది. రేపటి ధర్నాకు అనుమతినివ్వాలని పోలీసులను కోరితే పర్మిషన్ నిరాకరించారు. దీనిపై ఇవాళ ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి అర్జంట్ గా విచారణ చేపట్టాలని BJP తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించగా.. మధ్యాహ్నం 2:30 తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.
హైకోర్టు పర్మిషన్ తో రేపు భారీస్థాయిలో బహిరంగ సభను నిర్వహించేందుకు కమలం పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది.