
కాంగ్రెస్ పార్టీ పోరాటానికి భయపడి రుణమాఫీని తీసుకువచ్చారని, అందుకోసం లిక్కర్ నే KCR నమ్ముకున్నారని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. KCR లిక్కర్ కింగ్ అయినందునే లిక్కర్ డబ్బుల కోసం వైన్స్ లకు అడ్వాన్స్ నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. సాంకేతికంగా, న్యాయపరంగా ఇది ఏ మేరకు కరెక్టవుతుందో రివ్యూ చేయాల్సిన అవసరముందని అన్నారు. ‘కిరణ్ రెడ్డి శిష్యుడు కిషన్ రెడ్డి, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని TRS వాళ్లు అంటుండ్రు.. పాలిటిక్స్ లో వారితో కలిసి పనిచేసి ఉండొచ్చు.. వారిని కలిసి ఉండొచ్చు.. కానీ చంద్రశేఖర్ రావు కుల గురువు ఛార్లెస్ శోభరాజ్.. శోభరాజ్ శిష్యుడు ఈరోజు తెలంగాణను ఏలుతున్నడు.. అంతర్జాతీయ నేరగాడుగా, దోపిడీ దొంగగా ఛార్లెస్ శోభరాజ్ ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతిగాంచాడో… ముఖ్యమంత్రుల్లో లక్ష కోట్ల అక్రమ సంపాదన, రూ.10 వేల కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకున్న వ్యక్తి చంద్రశేఖర్ రావు’ అంటూ రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, BRS ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కొడంగల్ మాజీ MLA గుర్నాథ్ రెడ్డి సహా ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారందరికీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కొల్లాపూర్ లో సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీని రప్పించాలని రెండు సార్లు ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ నేతల్ని రేవంత్ సమక్షంలో దిల్లీకి తీసుకువెళ్లి పార్టీలో జాయిన్ చేసుకున్నారు.