
డబ్బు తీసుకుని ఓటేస్తే ఏమవుతుందో నల్గొండ జిల్లాలోని ఓ అభ్యర్థిని చూస్తే అర్థమవుతుంది. మొదటి విడతలో ఓటమి పాలైన నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బాతో ఇల్లిల్లూ తిరిగాడు. ఓట్లు వేశామన్న వారితో దేవుడిపై ప్రమాణం చేయిస్తున్నాడు. అందరూ ఓట్లేస్తే నేనెలా ఓడిపోయానని నిలదీస్తూ రూ.10 లక్షలు ఖర్చయ్యాయంటూ కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇక జిల్లాలో ఓడిన మిగతా అభ్యర్థులు సైతం రూ.20 లక్షల దాకా ఖర్చు చేశామంటూ భోరుమంటున్నారు.