
జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు ఎనిమిదో రౌండ్(Eighth Round) లోనూ హస్తం పార్టీ ఆధిక్యం పెరిగింది. ఇప్పటివరకు ఆ పార్టీ ఒక్క రౌండ్ లోనూ వెనుకబడలేదు. ప్రస్తుతానికి ప్రత్యర్థి సునీతపై 23 వేల ఓట్ల
లీడ్ లో నవీన్ యాదవ్ ఉన్నారు. 7వ రౌండ్ ముగిసేసరికి 19 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగిన నవీన్.. ఈ రౌండ్ లో మరో మూడున్నర వేల ఓట్లు సంపాదించగలిగారు. BRSకు సిట్టింగ్ సీటైన జూబ్లీహిల్స్ ను ఆ పార్టీ కోల్పోయే ప్రమాదంలో ఉంది. తొలి రౌండ్లో కేవలం 62 ఓట్ల ఆధిక్యం సంపాదించిన కాంగ్రెస్.. ఇక ప్రతి రౌండ్లోనూ దూసుకుపోయింది. మొత్తం 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలనుంది.