మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటన ప్రారంభం రోజునే ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్(Convoy)లోని ఎనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నా ప్రమాదం బారి నుంచి నేతలు బయటపడ్డారు. నల్గొండ జిల్లా పర్యటనకు బయల్దేరిన KCR బృందం.. వేములపల్లి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక వెహికిల్ డ్రైవర్ బ్రేక్ వేశాడు.
ముందు వెళ్తున్న కారు సడెన్(Sudden)గా బ్రేక్ వేడయంతో వెనుక వస్తున్న వెహికిల్స్ ఒకదానికొకటి ఢీకొట్టాయి. అయితే అందులో ఉన్న నాయకులకు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.