
2024 లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయన్న దానిపై ‘ఇండియా TV-CNX’ దేశవ్యాప్త ఒపీనియన్ పోల్ నిర్వహించింది. తెలంగాణలో BRS 8 సీట్లు సాధించే అవకాశం ఉందని.. BJPకి 6 సీట్లు.. కాంగ్రెస్ కు 2 సీట్లు, MIMకు అదే హైదరాబాద్ స్థానం దక్కుతుందని తెలిపింది. BRS ఇపుడున్న వాటిలో ఒక ప్లేస్ ను కోల్పోనుండగా.. BJP రెండు సీట్లను అదనంగా గెలుచుకుంటుందట.
కాంగ్రెస్ ది థర్డ్ ప్లేసేనట
ఓట్ల శాతంలోనూ BRS, BJP పోటీ పడుతుండగా.. హస్తం పార్టీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని తేల్చింది. అధికార BRSకు 40 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉండగా… 28 శాతం వస్తుందని BJP ఆశలు పెట్టుకోగా… 23 శాతం ఓట్లు కాంగ్రెస్ కు పడతాయని సర్వే వెల్లడించింది. 2019లో BRS 9, BJP 4, కాంగ్రెస్ 3, MIM 1 సీటు గెలుచుకున్నాయి.
ఏపీలోనూ అధికార పార్టీదే హవా
APలోని మొత్తం 25 సీట్లకు గాను 18 YSRCPకి, మిగతా 7 తెలుగుదేశం పార్టీకి వస్తాయని ‘ఇండియా TV-CNX’ ఒపీనియన్ పోల్ తెలిపింది. BJP, కాంగ్రెస్ కు రిక్తహస్తాలేనని స్పష్టం చేసింది. ఇక ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే YSRCPకి 46 శాతం… TDPకి 36 శాతం రానుండగా.. ఇక్కడ BJP 8 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలుస్తుందని’ఇండియా TV-CNX’ ఒపీనియన్ పోల్ తెలిపింది. 2019లో YSRCP 22, TDP 3 సీట్లు గెలుచుకున్నాయి.