
అభిమానుల్లో పవన్ కల్యాణ్ కు ఉన్న రేంజే వేరు. ఆ లెవెల్ స్టార్ డమ్ కలిగిన యాక్టర్ కమ్ పొలిటీషియన్… దేశంలోనే అత్యంత అరుదు అని చెప్పాలి. తనను ఒక్కసారైనా దగ్గరగా చూడాలని పరితపించేవారు లక్షల్లో ఉన్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండే పవన్… ఫ్యాన్స్ కు దగ్గరయ్యేందుకు తాజాగా ఇన్ స్టాగ్రామ్ ప్రారంభించారు. ఇన్ స్టా ఖాతా తెరిచిన కొన్ని గంటల్లోనే 10 లక్షల(మిలియన్) ఫాలోవర్స్ ను దాటేశారు. ఈ రేంజ్ లో ఫాలోయింగ్ దక్కడం పవన్ కే సాధ్యంగా నిలిచింది. అందుకే ఆయన ఫ్యాన్స్ ముద్దుగా.. ‘దటీజ్ పీకే’ అంటుంటారు.
ప్రస్తుతం ట్విటర్ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలతో ఎప్పటికప్పుడు అభిమానుల్ని అలరిస్తున్నారు. ఇప్పుడు ఇన్ స్టాలో అడుగుపెట్టిన జనసేనాని.. పొలిటికల్ ఇష్యూస్ తోపాటు సినిమా విశేషాలు పంచుకోబోతున్నారు. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో’… జైహింద్! అనే స్లోగన్ చేర్చి ట్విటర్ ఖాతాకు ఉన్న ప్రొఫైల్ నే ఇన్ స్టాకు కంటిన్యూ చేస్తున్నారు.