ఫార్ములా ఈ-రేస్ నిధులపై గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విచారణకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఫైల్ పై గవర్నర్ సంతకం చేయడంతో ఇక ACB దర్యాప్తు మొదలు కానుంది. KTR అరెస్టు విషయం గురించి తనకేం తెలియదని మంత్రి పొంగులేటి చెబుతున్నా.. ఆయన అరెస్టు తప్పదా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పాదయాత్రలు చేస్తారా, పొర్లు దండాలు పెడతారా అన్నది వారి ఇష్టం అని పొంగులేటి అనడంతో.. అరెస్టు విషయంపై క్లారిటీ ఇచ్చినట్లేనన్న మాటలూ వినపడుతున్నాయి. ఈ-రేస్ విషయంలో విదేశీ సంస్థకు రూ.55 కోట్లు బదలాయించారనేది ఆరోపణ కాగా.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఇది జరిగిందని రేవంత్ సర్కారు భావించింది. కేటీఆర్ తోపాటు సీనియర్ IAS అర్వింద్ కుమార్ పైనా విచారణ జరగనుండగా.. CS ఆదేశాల మేరకు ACB దర్యాప్తు స్టార్ట్ అవుతుంది. ఈ పరిణామాలతో రాబోయే రెండు రోజుల్లో హాట్ హాట్ రాజకీయాలు కనపడే అవకాశాలున్నాయి.