KTR బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్(రాజ్ పాకాల)పై పోలీసుల విచారణ పూర్తయింది. జన్వాడ ఫాంహౌజ్ పార్టీ కేసులో పరారీలో ఉన్నట్లు ప్రకటించగా.. హైకోర్టు ఆదేశాలతో ఆయన పోలీసుల ముందుకు వచ్చారు. తనను అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఈ నెల 28న ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. రెండు రోజుల్లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఆ గడువు నేటితో ముగియనుండగా.. 30న మధ్యాహ్నం తర్వాత రాజ్ పాకాల పోలీసుల వద్దకు చేరుకున్నారు. A1 నిందితుడైన రాజ్ పాకాల మొబైల్ ను సీజ్ చేయగా.. ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చానని ఆయన తెలిపారు. ఇంట్లో ఫ్యామిలీ పార్టీ చేసుకోకూడదా అని ప్రశ్నించారు.