
స్కిల్ డెవల్మెంట్ స్కామ్ లో మాజీ CM చంద్రబాబునాయుడే పాత్రధారి, సూత్రధారి అని ముఖ్యమంత్రి YS జగన్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా, స్కిల్ స్కామ్ లో పట్టుబడ్డా, ఎంతటి దొంగతనాలు, దోపిడీలు చేసినా, వెన్నుపోటు పొడిచినా.. చంద్రబాబును రక్షించుకునేందుకు ప్రత్యేక మీడియా ఉందని నిడదవోలు సభలో విమర్శించారు. ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికినా, ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చినా.. ఆయన చేసింది అసలు నేరమే కాదని వాదించడానికి కొందరు రెడీగా ఉన్నారన్నారు.
బాబు కుట్రలతో కుమ్మక్కైనవారు 10 కోట్ల మంది ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని జగన్ మండిపడ్డారు. నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునే దత్తపుత్రుడు ఒకరు అంటూ పవన్ కల్యాణ్ పై జగన్ ఫైర్ అయ్యారు.