ఎమ్మెల్యే పదవిని అడుక్కోవాలా.. అలా చేయాల్సి వస్తే అది వద్దే వద్దు అంటూ సంగారెడ్డి మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) హాట్ కామెంట్స్ చేశారు. పదవి లేకున్నా బతుకుతా అంటూ మాట్లాడారు. ఆయన మాటల్లోనే చూస్తే…
‘ఓట్ల కోసం అడుక్కోవాల్నా.. నాకవసరమా… ఒక కార్యకర్త ఫోన్ చేస్తడు.. లక్షనో, 50 వేలో అర్జంట్ గా కట్టాలని అడుగుతడు.. ఒకడు 5 లక్షలు అడుగుతడు.. రెణ్నల్లకు మూణ్నెల్లకో కార్యకర్తకు ఇస్తున్నా.. దవాఖానాలో పంచుకుంటామంటే రెండు లక్షలు ఇస్తున్నా.. అయినా ఇంత చేస్తున్నా ఓట్లు అడుక్కోవాలా’… అంటూ ఫైర్ అయ్యారు.