‘నా విషయంలో ఇంత శాడిస్టుల్లా వ్యవహరిస్తారా.. ఏంటి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దనా మీ ఉద్దేశం.. ఏడాది కాలంగా కొందరు దుష్పచారం చేస్తున్నారు.. వాళ్ల ఆనందమేంటో నాకు అర్థం కావడం లేదు’ అంటూ కాంగ్రెస్ MLA జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై కొద్దిరోజులుగా జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ పెద్దలు ఎందుకు స్పందింంచరు అంటూ ప్రశ్నించారు. BRSతో కొట్లాడి మరీ గెలిచా.. పాస్ పోర్ట్ కేసులో నన్ను జైలులో పెట్టారు.. 2017లో రాహుల్ సభ కోసం కష్టపడ్డా.. సోషల్ మీడియాలో నాపై ఇంత విష ప్రచారమా’ అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో విపరీత నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.. ఇది జర్నలిజమా.. దీని వెనుక ఉన్నదెవరు.. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ చూడలేదు.. ఏడాదిన్నరలోనే ఇవన్నీ చూస్తున్నానంటూ ఫైర్ అయ్యారు.
‘నేను రాహుల్ గాంధీని మొదటిసారి కలిసింది మీరు చూశారు.. కానీ రెండోసారి కలిసింది మీరు చూశారా అంటూ మీడియాతో అన్నారు. దేవుడి దగ్గరికి పోయి కోరికలు కోరుతాం.. అప్పుడే రిజల్ట్సయితే రావుగా.. అన్ని విషయాలు చెప్పుకుంటాం.. రాహుల్ తో అలాగే చెప్పుకున్నాం.. మీతో ఎప్పుడూ నేను మాట్లాడలేదు.. చాలా రోజుల తర్వాత మీతో మళ్లీ మాట్లాడాల్సి వచ్చింది’ అంటూ జగ్గారెడ్డి అన్నారు. ‘సోషల్ మీడియాను ఎక్కువగా వాడేది TDPనే.. ఆ కల్చర్ ఇప్పుడు కాంగ్రెస్ కు పట్టుకుంది.. ఇంత క్లారిటీగా చెప్పినంక కూడా ఎవరైనా పిచ్చి కూతలు కూస్తే.. రాజకీయ శీలానికి కళంకం తీసుకొస్తే మంచిగుండదు.. వార్నింగ్ ఇస్తున్నా.. నా రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీతోనే.. మళ్లీ మళ్లీ చెప్తున్నా రాహుల్ గాంధీతోనే జగ్గారెడ్డి ప్రయాణం’ అంటూ స్పష్టం చేశారు.