
వచ్చే ఎలక్షన్లలో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్న BJP… రాష్ట్రానికి మరో ఇద్దరు సీనియర్ లీడర్లను కేటాయించింది. తెలంగాణ BJP ఎన్నికల ఇంఛార్జిగా సీనియర్ లీడర్ ప్రకాశ్ జవదేకర్ ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు J.P.నడ్డా ఆర్డర్స్ రిలీజ్ చేశారు. ఆయనకు అసిస్టెంట్ ఇంఛార్జిగా సునీల్ బన్సల్ పనిచేయనున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ ప్రకాశ్ జవదేకర్ ఇంఛార్జిగా పనిచేశారు. అప్పుడు BJP రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది.
తెలంగాణతోపాటు మొత్తం నాలుగు రాష్ట్రాలకు ఎలక్షన్స్ ఇంఛార్జ్ లను ప్రకటిస్తూ హైకమాండ్ డిసిషన్ తీసుకుంది. ఛత్తీస్ గఢ్ ఇంఛార్జిగా ఓం ప్రకాశ్ మాథుర్, రాజస్థాన్ ఇంఛార్జిగా ప్రహ్లాద్ జోషి, మధ్యప్రదేశ్ ఇంఛార్జిగా భూపేంద్ర యాదవ్ ను నియమించింది.