ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తొలి నాలుగు సంవత్సరాలు KCR ఆయన కుటుంబం కోసమే పనిచేశారని, ఇక చివరి ఏడాది ప్రజల కోసమంటూ ఎన్నికల టైమ్ లో హడావుడి చేస్తున్నారని MLC జీవన్ రెడ్డి విమర్శించారు. KCR ప్రభుత్వంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లల్లో మేం ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లున్న ఊళ్లల్లో మీరు ఓట్లు అడుగుతారా అని సవాల్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా.. గత మూడేళ్లలో దళిత, బీసీలకు ఎంత నిధులిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పులు ఈశ్వర్ మాట్లాడిన మాటలను జీవన్ రెడ్డి ఖండించారు. పెరిగిన జనాభా ప్రకారం దళితులకు రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని విమర్శించారు.