ఝార్ఖండ్ లో ఈసారి అధికారం(Power) మారుతుందని, JMMను కాదని BJPకే పట్టం కడతారన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. CM సోరెన్ వెంటే ఉంటామని అక్కడి ప్రజలు చాటిచెప్పడంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా(JMM).. మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. స్వయంగా ఆయన బర్హెయిత్ అసెంబ్లీ సెగ్మెంట్లో కమలం పార్టీ అభ్యర్థి గమ్లియేల్ హెంబ్రోమ్ పై ఆధిక్యంలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో సోరెన్.. బహ్రెయిత్ లో 25,740 ఓట్లతో, డుమ్కాలో 13,188 ఆధిక్యంతో గెలుపొందారు.
మనీ లాండరింగ్ కేసులో CM హేమంత్ సోరెన్ ను కొద్ది నెలల క్రితం ED అరెస్టు చేయడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. మొన్నటి జూన్లో బెయిల్ పై బయటకు వచ్చాక జులైలో తిరిగి పార్టీ శాసనసభాపక్ష నేతగా సోరెన్ ఎన్నికయ్యారు. అలా మూడోసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించారు. మొత్తం 81 స్థానాలకు గాను 41 సీట్లు గెలవాల్సి ఉండగా… JMMతో కూడిన ఇండియా కూటమి 55 చోట్ల, BJP నేతృత్వంలోని NDA 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.