
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2007లోనే తమ పార్టీ తీర్మానం చేసిందని, అధికారంలోకి వస్తే ఆర్నెల్లకో జాబ్ క్యాలెండర్ (Job Calender) ప్రకటిస్తామని BJP తెలిపింది. ఈ మేరకు ఈటల రాజేందర్ జమ్మికుంట సభలో క్లారిటీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన సభకు కేంద్ర రక్షణ(Defence) శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. కుటుంబం కోసమే KCR పనిచేస్తున్నారని.. అలాంటి వ్యక్తికి రెండు సార్లు అధికారం ఇచ్చారని రాజ్ నాథ్ విమర్శించారు. 1984లో BJPకి రెండు లోక్ సభ సీట్లు మాత్రమే ఉంటే అందులో ఒకటి తెలంగాణదే అన్న ఆయన.. కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేయలేదని గుర్తు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా పాచికలు వేసినా ఆ ఎత్తులు పారలేదని రాజ్ నాథ్ అన్నారు. BRS అనుచరులకే దళితబంధు దక్కుతున్నదని, ధరణి ద్వారా భారీగా అవకతవకలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు.
మున్సిపల్ కార్మికుల్ని తొలగించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమ్మెలంటే ఇష్టం ఉండదని, హైదరాబాద్ లో నిరసనకు దిగిన 1,700 మంది మున్సిపల్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించిన విషయాన్ని మరచిపోలేదని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాలు బ్యాన్ చేశారన్న ఈటల… ఎన్ని కుటిల యత్నాలు చేసినా హుజూరాబాద్ లో తనను అడ్డుకోలేకపోయారని విమర్శించారు.