
జూబ్లీహిల్స్(Jubilee hills) నియోజకవర్గంలో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లడుగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి
పొన్నం ప్రభాకర్ ఓట్లు అడిగారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాల్ని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డుల పథకాల్ని ప్రజలకు చేరువ చేసిన విధానాన్ని తెలియజేశారు. గులాబీ పార్టీ(BRS), BJPనేతలు సైతం తమ అభ్యర్థుల తరఫున విస్తృతంగా పర్యటిస్తున్నారు.