Published 28 Nov 2023
ముఖ్యమంత్రి KCR రాకతో కామారెడ్డి నియోజకవర్గం పూర్తిగా మారిపోతుందని, అందుకు తనది బాధ్యత అని మంత్రి KT రామారావు అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు లోకల్, నాన్ లోకల్ అని ఉంటుందా అని ప్రశ్నించారు. KCRను గెలిపిస్తే కామారెడ్డిని తాను దత్తత తీసుకుని రానున్న రోజుల్లో డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తానని రోడ్ షోలో మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే జనవరిలో రేషన్ కార్డులు అందజేస్తామని, తొమ్మిదన్నరేళ్లలో మోదీ సర్కారు దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
ఇప్పటిదాకా నాలుగున్నర లక్షలకు పెన్షన్లు ఇస్తున్నామని, మరో లక్ష మందికి ఇవ్వడానికి తమకు ఇబ్బందేమీ లేదని KTR స్పష్టం చేశారు. వడ్డించేవాడు మీ వాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్నట్లు ముఖ్యమంత్రే మీ దగ్గరకు వస్తే అంతకన్నా ఏముంటుందని కేటీ రామారావు గుర్తు చేశారు.