ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కర్ణాటక ఆమోదించడంపై లోక్ సభ, రాజ్యసభ(Rajyasabha)ల్లో రగడ జరిగింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలంటూ BJP సభ్యులు పట్టుబట్టారు. గందరగోళం ఏర్పడటంతో సభల్ని మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. కన్నడ ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4% కోటా ఇచ్చేందుకు సిద్ధరామయ్య సర్కారు చట్టం తెచ్చింది. ఆ చట్టంలోని కేటగిరీ-1లో SC, STలు.. కేటగిరీ 2ఏలో BCలు.. కేటగిరీ 2బీ కింద ముస్లిం కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతారు. కర్ణాటక పబ్లిక్ ప్రొక్యూర్మెంట్(KTPP) ప్రకారం ఇకపై ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రూ.2 కోట్ల విలువ గల సర్కారీ పనులు చేసేందుకు అర్హులవుతారు. ‘భారత రాజ్యాంగాన్ని మార్చి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు’ అని BJP మండిపడింది.