KCR పాలన ఐఫోన్ లా ఉంటే రేవంత్ పరిపాలన చైనా ఫోన్ మాదిరిగా ఉందంటూ కల్వకుంట్ల కవిత పోలిక పెట్టారు. ఐఫోన్(iPhone)కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటుందో ఈ ఇద్దరి పాలనలో అంత తేడా ఉంటుందన్నారు. జగిత్యాలలో మాట్లాడిన ఆమె.. తప్పుడు జనాభా లెక్కలతో BCలు ఆగ్రహంతో ఉన్నారని గుర్తు చేశారు. BCల సంఖ్య 52 శాతమని 2014లోనే తాము చేసిన సర్వేలో తేలిందని, ఇప్పుడు రేవంత్ సర్కారు దాన్ని తక్కువ చేసి చూపిందన్నారు. కులాల వారీ జనాభా లెక్కల్ని ఎందుకు బయటపెట్టడం లేదు.. మంత్రి పొన్నం ప్రభాకర్ BC సంఘాలతో తూతూమంత్రంగా సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు.