
ఇప్పుడు టాస్ మాత్రమే వేశానని, ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉందని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ తో అంటకాగుతున్నారంటూ విమర్శలు చేస్తున్నవారి బాగోతం బయటపెడతానన్నారు. ‘ఉద్యమంలో ఎవరెవరి వద్ద దోచుకున్నరు.. ఎంత సంపాదించిండ్రో అంతా తెలుసు.. నా దగ్గర మామూలు చిట్టా లేదు.. నా భర్త పేరు పెట్టి బద్నాం చేసిన ఛానల్ కు, BJP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపిస్తున్నా.. MLA మాధవరం కృష్ణారావు వారంలో క్షమాపణ చెప్పాలి.. BRS ప్రభుత్వం అవినీతికి దారి వేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రహదారిగా చేసుకుంది..’ అని విమర్శించారు.