
మాజీ మంత్రి హరీశ్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి మండిపడ్డారు. మెదక్ జిల్లాలో ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షలు తీసుకున్నారని, ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్న నాయకుల్ని ఎలా గెలిపిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ‘మోసం చేయడం బంద్ చేసి కృష్ణుడివా, అర్జునుడివా ఏందో డిసైడ్ చేసుకుని ఆ పాత్ర ఏందో చూపించాలి.. పేరుకు కృష్ణార్జునులు పెట్టుకుని ఒకరిపై ఒకరు బాణాలు వేసుకుంటే బలయ్యేది BRS కార్యకర్తలు కాదా..’ అని సెటైర్లు వేశారు. పార్టీకి అన్నీ తానైనట్లు నటిస్తూ ఇబ్బందికర పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.