‘నాకు వచ్చింది ఈడీ నోటీసు కాదు.. అది మోదీ నోటీసు’ అంటూ MLC కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వచ్చిన ఆ నోటీసును పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే దాన్ని లీగల్ టీమ్ కు పంపించామని. పార్టీ లీగల్ టీమ్ సలహా మేరకు ముందుకెళ్తామని తెలిపారు. ఏడాది కాలంగా ఈ డ్రామా కొనసాగుతూనే ఉంది.. టీవీ సీరియల్ లా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారని కవిత విమర్శించారు. ‘నోటీసును సీరియస్ గా తీసుకోవద్దు.. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మళ్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు.. ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు.. గతంలో 2జీ విచారణ కూడా చాలా కాలం పాటు సాగింది.. తెలంగాణ ప్రజలకు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోరు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం(Scam)లో ఆమెను విచారణకు హాజరుకావాలని ఈరోజు ఈడీ నుంచి నోటీసులు వెలువడ్డాయి. శుక్రవారం(ఈనెల 15న) నాడు ఢిల్లీలోని ED కార్యాలయానికి హాజరు కావాలని అందులో దర్యాప్తు సంస్థ తెలిపింది.