BC రిజర్వేషన్ల మీద CM రేవంత్ మాట్లాడిన అంశాలపై పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని MLC కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి నాయకులతో సమావేశమైన ఆమె.. అన్ని పార్టీల్లోనూ వివాదాలున్నాయని గుర్తు చేశారు. ‘CM రేవంత్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారు.. బండి సంజయ్ కి డైరెక్టుగా ఈటల రాజేందర్ వార్నింగ్ ఇస్తారు.. ఇలా అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది.. BRSపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు..’ అని అన్నారు. కవితను ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడటం.. ఆయనతో అలా మాట్లాడించింది BRS ప్రధాన నేత అని ఆమె విమర్శించడంతో.. గందరగోళం ఏర్పడిన తీరుపై వివరణ ఇచ్చారు.