జైలుకు పంపి తనను జగమొండిని చేసిండ్రంటూ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు. తీహార్ జైలు నుంచి బయటకు రాగానే కుమారుడు, భర్త అనిల్, సోదరుడు KTRను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
18 ఏళ్ల రాజకీయ జీవితం(Political Career)లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానన్న ఆమె.. పిల్లల్ని ఐదున్నర నెలలు జైల్లో ఉండటం బాధాకరమన్నారు. హరీశ్ రావుతోపాటు BRS నాయకులు పెద్దసంఖ్యలో తీహార్ కారాగారం వద్దకు చేరుకున్నారు.