
జూబ్లీహిల్స్ లో BRS అభ్యర్థి ఓటమి తర్వాత కల్వకుంట్ల కవిత(Kavitha) సంచలన పోస్ట్ చేశారు. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ‘ఎక్స్’లో చేసిన ట్వీట్ సంచలనం రేపింది. హరీశ్, సంతోశ్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆమె.. గత కొద్దిరోజులుగా సొంతంగానే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత ఆమె చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.