BRS నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత.. హరీశ్, సంతోశ్ రావు కుట్రల వల్లే తనను బహిష్కరించారన్నారు. MLC పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన సోదరుడు KTRకూ ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డితో కలిసి హరీశ్ చేస్తున్న కుట్రలకు బలికావద్దన్నారు. సంతోశ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదన్నారు. నేరెళ్లలో ఏడుగురు దళితుల్ని కొట్టించిన కేసులో పైసలు సంతోశ్ రావుకు, పేరు మాత్రం KTRకు అని గుర్తుచేశారు. ఏ పార్టీలో చేరేది లేదని కవిత స్పష్టం చేశారు.