Published 26 Nov 2023
ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది.. నా జీవితానికి ఇది చాలు అంటూ ముఖ్యమంత్రి KCR సంబోధించారు. ఈ వయసులో నాకింకేం కావాలి అంటూ మాట్లాడారు. ‘నా తండ్లాట, కొట్లాట పదవి కోసం కాదు.. తెలంగాణ(Telangana) తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అనే పేరుకు మించిన పదవి ఉందా.. ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన.. నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు CM ఎవరూ లేరు.. 70 ఏళ్ల వయసున్న నాకు జీవితంలో ఇంకేం కావాలి.. ఇంతకుమించిన తృప్తి ఇంకేముంటుంది.. అని గుర్తు చేసుకున్నారు.
పేదరికం లేని రాష్ట్రం కోసం
కేరళలా 100 శాతం అక్షరాస్యత సాధించిన తెలంగాణ కోసమే తన తపనంతా అని చెప్పిన కేసీఆర్.. పేదరికం లేని రాష్ట్రం కావాలన్నదే తన పంతమని అన్నారు. గత సభలకు భిన్నంగా ముఖ్యమంత్రి మాట్లాడటం, తెలంగాణ విషయంలో తనకున్న క్రెడిట్ చాలు ఇంకేం సాధించాలి అన్న ఉద్దేశంతో కామెంట్ చేయడం ఆశ్చర్యానికి కారణమైంది. ముఖ్యమంత్రి ఒక్కసారిగా ఇలా మాట్లాడటంతో అందరిలోనూ ఆసక్తి కనిపించింది.