
చట్టసభల్లో మహిళలు, BCలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలంటూ భారత్ రాష్ట్ర సమితి(BRS) తీర్మానం చేసింది. ఈ తీర్మానంతో కూడిన లెటర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపింది. ప్రగతి భవన్ లో సమావేశమైన పార్టీ పార్లమెంటరీ కమిటీ… CM కేసీఆర్ అధ్యక్షతన సాగింది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగింది. చట్టసభల్లో బీసీలు, మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు గాను 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.
విద్య, ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం రిజర్వేషన్ల విధానం అమలు చేస్తున్నదని, ఇదే పద్ధతిని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరముందని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ తెలిపారు.