
కాంగ్రెస్ CLP నాయకుడు భట్టి విక్రమార్కకు CM కేసీఆర్ సెటైర్ వేశారు. పాదయాత్రలో గమనించిన సమస్యలను భట్టి విక్రమార్క అసెంబ్లీలో వివరించారు. పేదలు ఇబ్బంది పడుతున్నారంటూ పలువురి పేర్లతో ప్రస్తావించారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత కేసీఆర్ మాట్లాడారు. రాగానే భట్టి విక్రమార్క స్పీచ్ ను గుర్తు చేశారు. ‘ కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తరు అధ్యక్షా.. అది సహజమైన పరిణామం.. మొత్తం మీద భట్టి విక్రమార్క సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగుంది.. అద్భుతమైన పాదయాత్ర.. ఉత్తర, దక్షిణ తెలంగాణ.. అదంతా వారు చెప్పుకున్నరు సంతోషం.. మంచిగ ఒక స్వామీజీ ప్రవచనం లాగా చెప్పినారు.. అనగానే సభ్యుల నుంచి నవ్వులు విరిశాయి. అటు వైపు నుంచి ఏం పాదయాత్ర చేస్తే తప్పా అన్నట్లు వినపడగానే వెంటనే CM చురకంటించారు. ‘మీరు పాదయాత్రలు మళ్లీ మళ్లీ చేయాలి.. ప్రజల సమస్యలు గుర్తించాలి’ అంటూ సెటైర్ వేశారు.