మహారాష్ట్ర రాజకీయాలపై మెయిన్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. పలు పార్టీలకు చెందిన అక్కడి నేతలకి కండువాలు కప్పుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పర్యటించిన కేసీఆర్.. మరో రెండ్రోజుల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ 26, 27 తేదీల్లో పండరీపూర్, తుల్జాపూర్ వెళ్లనున్న సీఎం.. ప్రఖ్యాత ఆలయాల్లో పూజలు చేస్తారు. సోమవారం సాయంత్రం షోలాపూర్ చేరుకుని ఆ రోజు అక్కడే బస చేస్తారు. మహారాష్ట్ర లీడర్లు, చేనేత కార్మికులతో సీఎం మీట్ అయ్యే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం పండరీపూర్ వెళ్లి విఠోభారుక్మిణీ మందిర్ లో పూజల అనంతరం.. దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుంటారు.