బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రికి ఆవేదన ఉండదా.. ఎంతో బాధ ఉన్నా ఓపికంగా మౌనం పాటిస్తున్నా.. అగ్నిపర్వతంలా మారినా గరళకంఠుడిగా బాధను దిగమింగుకుంటున్నా.. రాజకీయంగా ఎదుర్కోలేకే నా బిడ్డను ఇరికించారు.. అంటూ మాజీ(Former) ముఖ్యమంత్రి KCR ఆవేదన చెందారు.
ఎప్పుడెలా కొట్టాలో తనకు తెలుసున్న KCR.. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరును అందరూ చూస్తున్నారన్నారు. పార్టీ MLAలు, MLCలతో భేటీ అయిన మాజీ CM.. ఎవరు ఉన్నా, వెళ్లిపోయినా ఏం కాదు.. ఆరు సీట్లున్న కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే MLAలు బాగా పనిచేస్తారు అంటూ మాట్లాడారు.