ప్రధానమంత్రి మోదీ(Modi)పై కాంగ్రెస్ అధ్యక్షుడు(AICC Chief) మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికతోనే గత నెలలో ప్రధాని జమ్మూకశ్మీర్ టూర్ రద్దయిందన్నారు. ‘పహల్గామ్ దాడికి 3 రోజుల ముందుగా మోదీకి సమాచారం అందింది.. అందుకే పర్యటన రద్దు చేసుకున్నారు.. దాడిని ముందుగానే గుర్తించడంలో నిఘా సంస్థలు, BJP సర్కారు విఫలమయ్యాయి.. పాకిస్థాన్ పై ఏ చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ మద్దతు ఉంటుంది..’ అని అన్నారు. ఏప్రిల్ 19న శ్రీనగర్ లో మోదీ పర్యటించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక రద్దు చేశారు. శ్రీనగర్ కు 90 కి.మీ. దూరంలోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు.